ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) అమలు చేస్తున్న‘తల్లికి వందనం‘(Thalliki Vandanam Scheme) పథకానికి సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించి ఈసారి అంగన్వాడీ, శానిటేషన్ (Anganwadi/Sanitation) ఉద్యోగుల పిల్లలకు కూడా పథకం వర్తించే (Scheme applicable) లా నిర్ణయం తీసుకోవడం వారికి ఊరట నిచ్చే విషయం. అదే సమయంలో RTE – Right to Education Act కింద చదువుతున్న విద్యార్థులు, ఇప్పటికే ప్రభుత్వ స్కాలర్షిప్లు పొందుతున్న వారికి తల్లికి వందనం నిధులను వారి ఖాతాల్లో జమ చేసే అంశంపై స్పష్టత ఇచ్చింది. అర్హులైన ప్రతి తల్లి ఖాతాలో గరిష్టంగా రూ.13,000 జమ చేయనున్న ఈ పథకంలో ఎవరికెంత మొత్తం లభిస్తుంది? ఎవరికి మినహాయింపులు ఉంటాయి? తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం వెల్లడించిన ముఖ్యాంశాలు ఇవే.
Good news for the families of Anganwadi and sanitation workers..
గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల కారణంగా అంగన్వాడీ కార్యకర్తలు(Anganwadi Workers), శానిటేషన్ వర్కర్ల (sanitation) పిల్లలు ఈ పథకం ప్రయోజనం పొందలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనను సవరించి, అంగన్వాడీ మరియు శానిటేషన్ ఉద్యోగుల పిల్లలను కూడా తల్లికి వందనం పథకంలో చేర్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Sate wise) సుమారు 17 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు, శానిటేషన్ వర్కర్ల కుటుంబాలకు చెందిన విద్యార్థులు లబ్ధి (Profit) పొందనున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో గరిష్టంగా రూ.13,000 జమ చేసే అవకాశం ఉంది.
RTE విద్యార్థులకు డబ్బు ఎలా జమ అవుతుంది?
విద్యాహక్కు చట్టం (Right to Education Act – RTE) కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా చదువుతున్న 1,04,046 మంది విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే వారికి పూర్తి రూ.13,000 నేరుగా జమ కాదు. ప్రభుత్వం ఆయా ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించాల్సిన ఫీజు (Fee) మొత్తాన్ని ముందుగా మినహాయిస్తుంది. ఆ తర్వాత మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని మాత్రమే తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. అందువల్ల RTE విద్యార్థులకు వచ్చే మొత్తం వారి స్కూల్ ఫీజు ఆధారంగా మారే అవకాశం ఉంటుంది.
స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థులకు కీలక నిబంధన
ఇప్పటికే ప్రీమెట్రిక్ లేదా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ (Prematric or Post-matric scholarship) పొందుతున్న విద్యార్థులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక నిబంధన అమలు చేయనుంది. వారికి ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్షిప్ మొత్తాన్ని లెక్కలోకి తీసుకుని, మిగిలిన మొత్తాన్ని మాత్రమే తల్లికి వందనం పథకం కింద జమ (Depasit) చేస్తారు. దీంతో ఒకే ప్రయోజనానికి రెండుసార్లు ప్రభుత్వ నిధులు వెళ్లకుండా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
Thalliki Vandanam Scheme Eligibility ఎలా తెలుసుకోవాలి?
‘తల్లికి వందనం’ పథకానికి మీరు అర్హులా? మీ ఖాతాలో నిధులు జమ అవుతాయా? అనే సందేహం ఉంటే కొన్ని విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఆన్లైన్లో మీ అర్హతను సులభంగా తెలుసుకోవడానికి ఈ దశలను అనుసరించండి.
– ముందుగా గూగుల్ క్రోమ్ లో bm-sgsw.ap.gov అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

– హోమ్‌పేజీలో కనిపించే “Scheme Eligibility” లేదా “Application Status” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

– మీ Thalliki Vandanam ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నంబర్ (Aadhaar Number) లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ (Registered mobile number) ఎంటర్ చేయండి.
– మీ మొబైల్‌కు వచ్చిన OTP ను నమోదు చేసి ధృవీకరించండి.
– అనంతరం మీ అర్హత స్థితి (Eligibility Status) లేదా దరఖాస్తు వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
- అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఒకే విధంగా మొత్తం జమ కావడం తప్పనిసరి కాదు.
- RTE, స్కాలర్షిప్ విద్యార్థులకు వర్తించే మినహాయింపులు ఉండవచ్చు.
- బ్యాంక్ వివరాలు లేదా విద్యార్థి వివరాల్లో పొరపాట్లు (Errors in Bank Details or Student Details) ఉంటే చెల్లింపులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
- అధికారిక ప్రకటనల్లో మార్పులు వస్తే వాటినే తుది సమాచారంగా పరిగణించాలి.
దీనిని చదవండి – తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. NEHS హెల్త్ స్కీమ్ ప్రారంభం – డిజిటల్ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ ఇలా!
ముఖ్యంగా.. Thalliki Vandanam Scheme (తల్లికి వందనం) లో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు అనేక కుటుంబాలకు ఊరట కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు పథకానికి దూరంగా ఉన్న అంగన్వాడీ, శానిటేషన్ (Anganwadi/Sanitation) ఉద్యోగుల పిల్లలను చేర్చడం సానుకూల నిర్ణయంగా భావిస్తున్నారు. మరోవైపు RTE, స్కాలర్షిప్ లబ్ధిదారులకు వర్తించే మినహాయింపుల (Exceptions) పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో అపోహలకు తెరపడింది. పథకానికి సంబంధించిన తుది అర్హత, చెల్లింపు వివరాల కోసం అధికారిక ప్రభుత్వ పోర్టల్ లేదా సంబంధిత విద్యా శాఖ అధికారులను సంప్రదించడం ఉత్తమం.







