తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ పొందేవారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (New Employees Health Scheme – NEHS)’ అధికారికంగా ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా అర్హులైన ఉద్యోగులు (Employees), పెన్షనర్లు (Pensioners) మరియు వారి కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో (Selected Network Hospitals) పూర్తిగా క్యాష్‌లెస్ (Cashless) వైద్య సేవలు పొందవచ్చు. అలాగే ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి డిజిటల్ హెల్త్ కార్డ్ (Digital Health Card) ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది.
జూలై 16, 2026న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) ఈ పథకాన్ని, ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు. ఉద్యోగుల ఆరోగ్య సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా (Transparently/Quickly) అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
NEHS అంటే ఏమిటి | What is NEHS ?
న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS) అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను నగదు చెల్లించకుండా అందించే ఆరోగ్య పథకం. గత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లో ఎదురైన సాంకేతిక సమస్యలు, ఆస్పత్రుల వద్ద చికిత్సలో ఆలస్యం, బిల్లుల చెల్లింపుల వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త విధానాన్ని CGHS మార్గదర్శకాల ప్రకారం రూపొందించారు.
ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది| Who Does This Scheme To Apply?
ఈ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS) ద్వారా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా (Telangana State Wide) సుమారు 4.39 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3.62 లక్షల మంది పెన్షనర్లు, అలాగే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 17.88 లక్షల మంది నాణ్యమైన క్యాష్‌లెస్ ఆరోగ్య సేవల ప్రయోజనం (Health Benefits) పొందనున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆర్థిక భారం (Financial Burden) లేకుండా వైద్య చికిత్స పొందే అవకాశం కలుగుతుంది.
NEHS పథకం ప్రధాన ప్రయోజనాలు | Main Benefits NEHS Scheme
న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS) ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు నాణ్యమైన వైద్య సేవలను ఆర్థిక భారం లేకుండా పొందే అవకాశం కల్పించారు. ఈ పథకంలో ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే:
– 100% క్యాష్‌లెస్ చికిత్స: నెట్‌వర్క్ ఆస్పత్రిలో చేరిన తర్వాత లబ్ధిదారులు (Beneficiaries) ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. చికిత్స ఖర్చును పూర్తిగా పథకం ద్వారా భరిస్తారు.
– 1,816 వైద్య ప్యాకేజీలు: సాధారణ అనారోగ్యాల నుంచి క్లిష్టమైన శస్త్రచికిత్సల (Complex Surgeries) వరకు మొత్తం 1,816 వైద్య, శస్త్రచికిత్స ప్యాకేజీలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి.
– విస్తృత ఆస్పత్రుల నెట్‌వర్క్: రాష్ట్రంలోని 886 ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు (Private Corporate Hospitals) మరియు 114 ప్రభుత్వ ఆస్పత్రుల్లో (Government Hospitals) పూర్తిగా క్యాష్‌లెస్ వైద్య సేవలు పొందే అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (State Wide) నాణ్యమైన ఆరోగ్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
ఉద్యోగులు ఎంత చందా చెల్లించాలి?
NEHS పథకం అమలుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం “Employees Health Care Trust (EHCT)” ను ఏర్పాటు చేసింది. ఈ విధానంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ బేసిక్ పే లేదా బేసిక్ పెన్షన్‌లో (Basic Pay/Basic Pension) 1.5 శాతం మొత్తాన్ని ప్రతి నెల చందాగా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులు చెల్లించే చందాకు సమాన మొత్తాన్ని (Equal Subscription) రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్రస్ట్‌కు జమ చేస్తుంది. దీంతో పథకం నిర్వహణకు అవసరమైన నిధులు సమకూరుతాయి.
భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే?
ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ (Husband And Wife) ప్రభుత్వ ఉద్యోగులైతే (Employees), ఇద్దరి నుంచి విడివిడిగా చందా వసూలు చేయరు. కుటుంబంలో ఒకే సభ్యుడి (Member) బేసిక్ పేలో 1.5 శాతం మాత్రమే చందాగా వసూలు చేస్తారు. ఈ నిర్ణయం వల్ల ఒకే కుటుంబానికి రెండుసార్లు చందా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడటంతో పాటు, పథకం ప్రయోజనాలు కుటుంబ సభ్యులందరికీ కొనసాగుతాయి.
డిజిటల్ హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా?
ప్రభుత్వం ప్రారంభించిన న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అధికారిక పోర్టల్ ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు తమ డిజిటల్ హెల్త్ కార్డ్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే పోర్టల్‌లో జిల్లాల వారీగా నెట్‌వర్క్ ఆస్పత్రుల జాబితా, ఆరోగ్య మిత్రల సంప్రదింపు వివరాలు మరియు ఇతర NEHS సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
- ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో NEHS అధికారిక పోర్టల్‌ను సందర్శించండి.
- Employee ID లేదా నమోదైన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా లాగిన్ అవ్వండి.
- హోమ్‌పేజీలో Quick Actions లేదా Download Health Card ఎంపికపై క్లిక్ చేయండి.
- వెంటనే మీ డిజిటల్ హెల్త్ కార్డ్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సూచన: డిజిటల్ హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్ చేసేముందు మీ వ్యక్తిగత వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా నమోదయ్యాయో ఒకసారి తప్పనిసరిగా పరిశీలించండి.
కొత్త వెల్‌నెస్ సెంటర్లు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 12 వెల్‌నెస్ సెంటర్లకు (Wellness Wenters) అదనంగా మరో 24 కొత్త వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఓపీ (OP) సేవలు, ఉచిత మందులు, ప్రాథమిక వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
దీనిని చదవండి – తెలంగాణలో ఉచిత UPSC కోచింగ్.. నెలకు ₹5,000 స్టైపెండ్ కూడా! పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన New Employees Health Scheme (NEHS) ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా చెప్పవచ్చు. గత పథకంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపేలా క్యాష్‌లెస్ వైద్యం, డిజిటల్ హెల్త్ కార్డ్, విస్తృత ఆస్పత్రుల నెట్‌వర్క్, కొత్త వెల్‌నెస్ సెంటర్లతో ఈ పథకాన్ని రూపొందించారు. అయితే, పథకానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలు, ఆస్పత్రుల జాబితా లేదా ఇతర అప్‌డేట్‌ల కోసం అధికారిక తెలంగాణ ప్రభుత్వ పోర్టల్‌ను మాత్రమే పరిశీలించడం మంచిది.







