JOIN
Latest NewsTelanganaAndhra PradeshEducationLatest JobsSportsTechnology

Bank of Baroda Specialist Officer Jobs 2026: 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. అర్హతలు, జీతం, పూర్తి వివరాలు

బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda – BOB) శుభవార్త చెప్పింది. మొత్తం 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist OfficerSO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిజిటల్ బ్యాంకింగ్(Digital Banking), ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ(Information Security), డేటా మేనేజ్‌మెంట్(Data Management), ఫెసిలిటీ మేనేజ్‌మెంట్(Facility Management), ఫైనాన్స్(Finance) వంటి విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతోంది. పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, B.E/B.Tech, MBA, MCA, CA, ICWA వంటి అర్హతలు, సంబంధిత అనుభవం (Experience) అవసరం. ఎంపికైన వారికి ₹48,480 నుంచి ₹1,20,940 వరకు ప్రాథమిక వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 6, 2026 నుంచి ప్రారంభమై ఆగస్టు 26, 2026 వరకు కొనసాగనున్నాయి. బ్యాంకింగ్ రంగంలో స్పెషలిస్ట్ కెరీర్ కోరుకునే అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

BOB Specialist Officer Recruitment 2026

Bank of Baroda Specialist Officer Jobs 2026లో మొత్తం 206 ఖాళీలు.

బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer – SO) పోస్టులను భర్తీ చేయనున్నారు. డిజిటల్ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ (EDMO), కార్పొరేట్ అకౌంట్స్, టాక్సేషన్ ప్లానింగ్, డేటా సైన్స్, డిజిటల్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ తదితర కీలక విభాగాల్లో 22 రకాల స్పెషలిస్ట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

విభాగంపోస్టులు
డిజిటల్ బ్యాంకింగ్71
ఫెసిలిటీ మేనేజ్‌మెంట్46
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ35
సెక్యూరిటీ36
ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ (EDMO)13
కార్పొరేట్ అకౌంట్స్ & టాక్సేషన్5
మొత్తం ఖాళీలు206

విద్యార్హతలు – Educational Qualifications

బ్యాంక్ ఆఫ్ బరోడా Specialist Officer – SO పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టును బట్టి నిర్దేశించిన విద్యార్హతలు (Educational Qualifications), పని అనుభవం (Experience) కలిగి ఉండాలి. సాధారణంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం (Recognized University) నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (Graduation or Post Graduation) పూర్తి చేసి ఉండాలి. టెక్నికల్ పోస్టులకు B.E/B.Tech (సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్/ఐటీ), ఐటీ(IT) విభాగాలకు BCA, MCA లేదా M.Sc, మేనేజ్‌మెంట్(Management) పోస్టులకు MBA లేదా సమానమైన పీజీ డిప్లొమా, ఫైనాన్స్ పోస్టులకు CA లేదా ICWA అర్హతలు అవసరం. అలాగే, పోస్టును బట్టి 2 నుంచి 10 సంవత్సరాల వరకు సంబంధిత రంగంలో (Concerned Sector) పని అనుభవం కూడా తప్పనిసరి కావచ్చు. పూర్తి అర్హతల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.

వయోపరిమితి – Age Limit

BOB Specialist Officer Jobsకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు (Age) 2026 ఆగస్టు 1 నాటికి 23 నుంచి 43 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, పోస్టుల గ్రేడ్ (Scale-I, II, III, IV) ఆధారంగా కనీస, గరిష్ట వయోపరిమితిలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC (Non-Creamy Layer) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PwD (దివ్యాంగులు) అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు కల్పించారు.

AAI Recruitment 2026
AAI Recruitment 2026: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్ అభ్యర్థులకు భారీ అవకాశం..

జీతం Salary

Specialist Officer – SO పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గ్రేడ్‌ను (Grade) బట్టి ఆకర్షణీయమైన వేతన (Salary) ప్యాకేజీ అందుతుంది. ప్రాథమిక వేతనంతో పాటు డీఏ (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA), లీజ్డ్ అకామడేషన్ (Leased accommodation), మెడికల్ అలవెన్స్ (Medical Allowance), ఇతర బ్యాంకు భత్యాలు కూడా వర్తిస్తాయి.

గ్రేడ్ / స్కేల్నెలవారీ ప్రాథమిక వేతనం
JMG Grade / Scale-I₹48,480 – ₹85,920
MMG Grade / Scale-II₹64,820 – ₹93,960
MMG Grade / Scale-III₹85,920 – ₹1,05,280
SMG Grade / Scale-IV₹1,02,300 – ₹1,20,940

ఎంపిక – Selection Process

BOB Specialist Officer Recruitment 2026లో ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహించనున్నారు. పోస్టుల స్వభావం, దరఖాస్తుల సంఖ్యను బట్టి ఎంపిక(Selection) విధానంలో మార్పులు ఉండవచ్చు. సాధారణంగా అభ్యర్థులను విద్యార్హతలు (Educational Qualifications), అనుభవం (Experience) ఆధారంగా షార్ట్‌లిస్ట్ (Shortlist) చేసి, అవసరమైతే ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం సైకోమెట్రిక్ టెస్ట్ (Psychometric Test), గ్రూప్ డిస్కషన్ (Group Discussion) లేదా పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview) ద్వారా తుది ఎంపిక చేపడతారు.

  • అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్ (Application Shortlisting) – విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ప్రాథమిక ఎంపిక.
  • ఆన్‌లైన్ పరీక్ష(Online Test)– అవసరమైతే రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • సైకోమెట్రిక్ టెస్ట్ (Psychometric Test) – మానసిక సామర్థ్యాలను అంచనా వేస్తారు.
  • GD / పర్సనల్ ఇంటర్వ్యూ – తుది ఎంపిక కోసం నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు – Application Fee

బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ కేటగిరీకి అనుగుణంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి.

కేటగిరీదరఖాస్తు ఫీజు
General / OBC / EWS₹850 + వర్తించే పన్నులు
SC / ST / PwBD / మహిళలు₹175 + వర్తించే పన్నులు

ముఖ్యమైన తేదీలు – Important Dates

బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు గడువు తేదీలోపు దరఖాస్తు పూర్తి చేయాలి.

APCOB Recruitment 2026
డిగ్రీ అర్హతతో APCOBలో 338 ఉద్యోగాలు.. ఆగస్టు 7 వరకు దరఖాస్తులకు అవకాశం – APCOB Recruitment 2026
వివరాలుతేదీ
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం (Start Of Online Applications)06 ఆగస్టు 2026
దరఖాస్తుకు చివరి తేదీ (Applications End Date)26 ఆగస్టు 2026

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ – Online Application Process

ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక (Official) వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌ (Online) లో దరఖాస్తు చేసుకోవాలి.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి Careers విభాగంలోకి వెళ్లాలి.
  • అక్కడ Current Opportunities లో ఉన్న Specialist Officer Recruitment 2026 నోటిఫికేషన్‌ను ఎంచుకుని Apply Onlineపై క్లిక్ చేయాలి.
  • అనంతరం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అప్లికేషన్ ఫారమ్‌లో అవసరమైన వివరాలు నమోదు చేయాలి. ఫోటో, సంతకం, విద్యార్హతలు, అనుభవ పత్రాలను అప్‌లోడ్ చేసి, కేటగిరీకి అనుగుణంగా దరఖాస్తు రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.
  • చివరగా, భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ప్రింట్‌అవుట్‌ను భద్రపరచుకోవాలి.

అధికారిక లింకులు – Official Links

➡️ Check This Also: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్!

బ్యాంకింగ్ రంగంలో స్పెషలిస్ట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన అభ్యర్థుల(Candidates) కు బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన ఈ Bank of Baroda Specialist Officer Jobs 2026 మంచి అవకాశం. అర్హతలు (Qualifications) ఉన్న వారు చివరి తేదీ ఆగస్టు 26, 2026లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Share this News
Madhu Goud - Founder and Editor of Telugu Scheme Alert

Madhu Goud

Founder & Editor | Telugu Scheme Alert

Madhu Goud తెలుగు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా నోటిఫికేషన్లు, స్కాలర్‌షిప్‌లు, బ్యాంకింగ్ మరియు ప్రజా సేవలకు సంబంధించిన అంశాలపై రచనలు చేసే Founder & Editor. ప్రతి కథనాన్ని ప్రచురించే ముందు అధికారిక నోటిఫికేషన్లు, ప్రభుత్వ వెబ్‌సైట్లు మరియు ఇతర విశ్వసనీయ వనరులను పరిశీలించి, పాఠకులకు స్పష్టమైన, ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తారు.

You Might Also Like

Leave a Comment