తెలంగాణలో భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా “ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (Encumbrance Certificate – EC)” ను తప్పనిసరిగా చెక్ చేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ సర్టిఫికేట్ ద్వారా ఆస్తిపై గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలు, యాజమాన్యం ఎన్ని సార్లు మారింది, బ్యాంకులో తాకట్టు (Mortgage) ఉందా వంటి కీలక వివరాలను తెలుసుకోవచ్చు. అందువల్ల ఆస్తి కొనుగోలు, విక్రయం, హోం లోన్, లీగల్ వెరిఫికేషన్ (Property Purchase/Sale/Home loan/Legal verification వంటి సందర్భాల్లో Encumbrance Certificate – EC ముఖ్యమైన డాక్యుమెంట్ పరిగణిస్తారు.
గతంలో EC కోసం సబ్-రిజిస్ట్రార్ (Sub-Registrar) కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం తెలంగాణ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ (Registration & Stamps) శాఖ అందిస్తున్న డిజిటల్ సేవలతో ఈ ప్రక్రియ సులభమైంది. అధికారిక పోర్టల్‌లో డాక్యుమెంట్ నంబర్ (Document No) లేదా ఆస్తి వివరాలు (Property details) నమోదు చేసి కొన్ని నిమిషాల్లోనే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వివరాలను ఆన్లైన్లో చెక్ చేయవచ్చు. అవసరమైతే Encumbrance Certificate ను PDF రూపంలో డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఆస్తి కొనుగోలు చేసే ముందు ఈ సర్టిఫికేట్‌ను చెక్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే న్యాయపరమైన ఇబ్బందులను నివారించవచ్చు.
ఈ కథనంలో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏమిటి?, ఎప్పుడు అవసరం అవుతుంది?, తెలంగాణలో ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి? అనే అంశాలను సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం.
Property EC Check చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఆస్తిని కొనుగోలు చేసే ముందు “ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (EC)” ను చెక్ చేసుకోవడం ద్వారా అనేక కీలక విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో తలెత్తే చట్టపరమైన (Legal), ఆర్థిక సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది.
- ఆస్తిపై బ్యాంకు తాకట్టు (Mortgage) ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
- యాజమాన్యం ఎన్ని సార్లు మారింది, గత యజమానుల వివరాలను తెలుసుకోవచ్చు.
- హోం లోన్ దరఖాస్తు సమయంలో బ్యాంకులు అడిగే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఒకటి.
- ఆస్తి కొనుగోలు చేసే ముందు చట్టపరమైన రిస్క్‌ను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
- రిజిస్ట్రేషన్ శాఖలో నమోదైన లావాదేవీలను ధృవీకరించి, ఆస్తికి సంబంధించిన వివరాలను సరిచూసుకోవచ్చు.
- ఆస్తి కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు పారదర్శకతతో కూడిన సమాచారం పొందేందుకు EC ఎంతో ఉపయోగపడుతుంది.
గమనిక: ECలో రిజిస్ట్రేషన్ శాఖలో నమోదైన లావాదేవీలు మాత్రమే కనిపిస్తాయి. కోర్టు వివాదాలు లేదా నమోదు కాని ప్రైవేట్ ఒప్పందాల వివరాలు ఇందులో ఉండకపోవచ్చు. అందుకే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు ఇతర చట్టపరమైన పత్రాలను కూడా పరిశీలించడం మంచిది.
Encumbrance certificate (EC) ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి?
తెలంగాణలో ఆస్తికి సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (EC) లేదా విక్రయ/విక్రయేతర (Sales/Non-Sales) పత్రాల వివరాలు అధికారిక రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ పోర్టల్ ద్వారా ఇంటి నుంచే ఆన్లైన్లో చూడవచ్చు. ఇందుకు ఈ క్రింది స్టెప్స్‌ను అనుసరించండి.
- ముందుగా తెలంగాణ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:
https://registration.telangana.gov.in - హోమ్‌పేజీలోని Citizen Services విభాగంలో Encumbrance Certificate (EC) సేవపై క్లిక్ చేయండి. అకౌంట్ లేకపోతే ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి లాగిన్ అవ్వండి.
- స్క్రీన్‌పై కనిపించే నిబంధనలు చదివి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు EC వివరాలను వెతికేందుకు Document Number లేదా Property Details అనే రెండు ఎంపికల్లో మీకు అనుకూలమైన విధానాన్ని ఎంచుకుని, అవసరమైన వివరాలను నమోదు Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- వివరాలు సమర్పించిన తర్వాత ఆస్తికి సంబంధించిన నమోదైన లావాదేవీల జాబితా కనిపిస్తుంది. అవసరమైతే EC PDF రూపంలో డౌన్లోడ్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవచ్చు.
EC Onlineలో చెక్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
- డాక్యుమెంట్ నంబర్ లేదా సర్వే నంబర్‌ను ఖచ్చితంగా నమోదు చేయండి.
- సరైన రిజిస్ట్రేషన్ సంవత్సరం మరియు SROను ఎంచుకోవాలి.
- లో నమోదైన సమాచారం మాత్రమే కనిపిస్తుంది. పూర్తి చట్టపరమైన పరిశీలన కోసం అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
- ఆస్తి కొనుగోలు ముందు ECతో పాటు ఇతర యాజమాన్య పత్రాలను కూడా ధృవీకరించండి.
దీనిని చదవండి – తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం.. టెన్త్, ఇంటర్ చదివేందుకు ఇదే మంచి అవకాశం | TOSS Admissions 2026-27
ముఖ్యంగా, Encumbrance certificate – EC అనేది కేవలం ఒక పత్రం మాత్రమే కాదు, ఆస్తి లావాదేవీల్లో మీకు భద్రత కల్పించే కీలక ఆధారం. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే ముందు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్‌ను పరిశీలించడం ద్వారా ఆస్తిపై నమోదైన లావాదేవీల చరిత్రను తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అందిస్తున్న ఆన్లైన్ సేవలతో ఈ ప్రక్రియ మరింత సులభమైంది. అయితే ECలో నమోదైన వివరాలకే పరిమితమై నిర్ణయం తీసుకోవడం కంటే, ఇతర భూ రికార్డులు (Other land Records), యాజమాన్య పత్రాలు మరియు అవసరమైతే న్యాయ సలహాను కూడా పరిగణనలోకి తీసుకోవడం సురక్షితమైన నిర్ణయం అవుతుంది.







