ఓటర్ల జాబితాలో (Voter List) మీ పేరు, పుట్టిన తేదీ(Date of Birth), చిరునామా(Address) వంటి వివరాలు సరిగ్గా నమోదై ఉండటం ప్రతి ఓటరికి అత్యంత ముఖ్యమైన విషయం. ఈ వివరాల్లో చిన్న పొరపాటు ఉన్నా భవిష్యత్తులో ఓటు హక్కు వినియోగించే సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే భారత ఎన్నికల సంఘం (ECI-Election Commission of India) దేశవ్యాప్తంగా Special Intensive Revision – SIR 2026 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
ఈ ప్రత్యేక సవరణ (Amendment) ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఓటరు SIR 2026 Enumeration Formను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫారమ్‌ను అందరూ ఒకే విధంగా దాఖలు చేయలేరు. కొందరు అధికారిక పోర్టల్ (Official Portal) ద్వారా ఆన్‌లైన్‌లో (Online) సమర్పించవచ్చు. మరికొందరు మాత్రం బూత్ లెవల్ ఆఫీసర్ (Booth Level Office – BLO) ద్వారా ఆఫ్‌లైన్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఏ విధానం(Process) వర్తిస్తుందో ముందుగా తెలుసుకోవడం అవసరం.
SIR 2026 Enumeration Form అనేది ఓటర్ల వివరాలను మరోసారి ధృవీకరించి(Having verified) అవసరమైన సవరణలు(Amendments) చేయడానికి ఎన్నికల సంఘం(Election Commission) రూపొందించిన అధికారిక ఫారం(Official form). ఇందులో పేరు, పుట్టిన తేదీ, చిరునామా, కుటుంబ వివరాలు, ఆధార్‌కు సంబంధించిన సమాచారం, ఫోటో వంటి వివరాలను పరిశీలించి అవసరమైతే నవీకరించే(Update) అవకాశం ఉంటుంది. అలాగే ఒకే వ్యక్తి పేరుతో ఒకటి కంటే ఎక్కువ నమోదులు ఉండకుండా చూడటం, పాత(Old) లేదా తప్పుగా(Wrong) నమోదైన సమాచారాన్ని సరిచేయడం, తాజా మరియు ఖచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఆన్‌లైన్ ద్వారా SIR 2026 ఫామ్ పూరించే విధానం(Procedure for filling out the SIR 2026 form online)
మీరు ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ ఫామ్‌ను సులభంగా సబ్మిట్ చేయవచ్చు. అయితే, దీనికి ఒక ముఖ్యమైన నిబంధన(Condition) ఉంది.మీ ఆధార్ కార్డులోని పేరు(Aadhar Name), ఓటర్ ఐడీ (EPIC:Electors Photo Identity Card) లోని పేరు ఒకేలా ఉండాలి. అలాగే మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఓటర్ ఐడీతో లింక్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఆన్‌లైన్ విధానాన్ని ఎంచుకోవడానికి అర్హులు
ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం:
- మొదటగా భారత ఎన్నికల సంఘానికి(Election Commission of India) చెందిన అధికారిక Voters Citizen Service Portal ఓపెన్ చేయండి. మీ క్రెడెన్షియల్స్‌తో(Credentials) సైన్-ఇన్(Sign in) అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే కొత్తగా రిజిస్టర్(Register) చేసుకోండి.
- హోమ్‌పేజీ స్క్రీన్‌పై(On Home page screen) మీకు SIR 2026 సెక్షన్ కనిపిస్తుంది. దాని కింద ఉన్న Fill Enumeration Form ఆప్షన్‌పై(Option) క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ రాష్ట్రం పేరును(State Name) ఎంచుకుని, మీ ఓటర్ ఐడీ (EPIC) నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత మీ లింక్డ్ మొబైల్ నంబర్‌కు(Linked mobile number) వచ్చే OTP ని ఎంటర్ చేసి వివరాలను ధృవీకరించుకోండి(Do verify).స్క్రీన్‌పై ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పుట్టిన తేదీ(Date of Birth), ఆధార్ నంబర్(Aadhar Number) మరియు మీ కుటుంబ సభ్యుల వివరాలను తప్పులు లేకుండా జాగ్రత్తగా పూరించండి.
- మీ తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. గుర్తుంచుకోండి, ఫోటో వెనుక భాగం తప్పనిసరిగా తెల్లటి బ్యాక్‌గ్రౌండ్ (White background) మాత్రమే కలిగి ఉండాలి.
- మీరు ఎంటర్ చేసిన వివరాలన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాత Submit బటన్ నొక్కండి. స్క్రీన్‌పై వచ్చే రసీదును (Acknowledgement slip) పిడిఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి.
ముఖ్య గమనిక: ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసినంత మాత్రాన ప్రక్రియ ముగిసిపోదు. ఈ ఆన్‌లైన్ రసీదు (Acknowledgement) కాపీని ప్రింట్ తీసి, మీ ప్రాంతపు బీఎల్ఓ (BLO-Booth Level Officer) కి స్వయంగా అందజేయాలి. వారు తమ అధికారిక యాప్ ద్వారా మీ వివరాలను వెరిఫై చేసినప్పుడే మీ అప్లికేషన్ పూర్తిగా అప్రూవ్ అవుతుంది.
ఆఫ్‌లైన్ ద్వారా SIR 2026 ఫామ్ పూరించే విధానం
ఒకవేళ మీ ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ లింక్ కాకపోయినా, లేదా మీ పేరు/వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నా మీరు కంగారు పడాల్సిన పనిలేదు. మీ కోసం ఆఫ్‌లైన్ మార్గం(Offline route) అందుబాటులో ఉంది. నెట్‌వర్క్ సమస్యలు(Network Issues) ఉన్నవారు లేదా ఆన్‌లైన్ ప్రాసెస్ తెలియని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ విధానం ఎంతో సురక్షితమైనది మరియు సులువైనది.
ఆఫ్‌లైన్ అప్లికేషన్ విధానం(Online application process):
- మీ పోలింగ్ కేంద్ర(Polling station) పరిధిలోని స్థానిక బీఎల్ఓ (BLO) వద్దకు వెళ్లండి. వారి వద్ద ముందే ప్రింట్ చేసి సిద్ధంగా ఉన్న Enumeration Form ను అడిగి తీసుకోండి.
- ఫామ్ యొక్క కుడి వైపు(Right side) భాగంలో మీ ప్రస్తుత వివరాలను రాయాలి. మీ పుట్టిన తేదీ(DOB), వాడుకలో ఉన్న మొబైల్ నంబర్(Mobile number) మరియు ఆధార్ నంబర్‌ను(Aadhar number) స్పష్టంగా(Clearly), ఎలాంటి కొట్టివేతలు(Cancellations) లేకుండా రాయండి.
- గతంలో జరిగిన (2002/2005) ఇంటెన్సివ్ రివిజన్ రికార్డులలో(Intensive Revision Record) ఉన్న మీ వివరాలను లేదా మీ తల్లిదండ్రుల పాత వివరాలను అందుకోసం కేటాయించిన నిర్దేశిత కాలమ్‌లలో పూరించాల్సి ఉంటుంది.
- ఫామ్‌లో పాత ఫోటో(Old photo) ముద్రించి ఉన్న చోట, మీ తాజా కలర్ పాస్‌పోర్ట్(New colour passport size) photo) సైజ్ ఫోటోను గమ్‌తో జాగ్రత్తగా అతికించండి.
- ఫామ్ చివరన నిర్దేశించిన చోట మీ సంతకం లేదా బ్రొటనవేలు ముద్ర(Signiture or thumbprint) చేయండి. పూర్తి చేసిన ఫామ్‌ను తిరిగి మీ బీఎల్ఓ కి సమర్పించండి.
రసీదు తప్పనిసరి: ఫామ్ తీసుకున్న తర్వాత బీఎల్ఓ(BLO) మీకు సంతకం చేసిన అధికారిక రసీదు (Acknowledgment) కాపీని ఇస్తారు. దానిని భవిష్యత్తు అవసరాల కోసం జాగ్రత్తగా దాచుకోండి.
దీనిని చదవండి – AP SIR ఎఫెక్ట్: సర్వేలో 44.71 లక్షల ఓట్ల గల్లంతు.. మీ ఓటు లిస్టులో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
SIR 2026 Enumeration Form ప్రతి ఓటరికి అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. మీ వివరాలు సరిగ్గా ఉంటేనే ఓటర్ల జాబితా(Voter list) కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. అర్హత లేకపోతే BLO సహాయంతో ఆఫ్‌లైన్‌లో ఫారమ్ సమర్పించవచ్చు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. అందుకే మీ వివరాలను ఒకసారి పరిశీలించి, అవసరమైన మార్పులు ఉంటే ఆలస్యం చేయకుండా SIR 2026 ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.







