JOIN
Latest NewsTelanganaAndhra PradeshEducationLatest JobsSportsTechnology

LIC Bima Sakhi: మహిళలకు నెలకు రూ.7000 ఇచ్చే సూపర్ స్కీమ్.. అర్హతలివే!

ప్రతి ఒక్కరు సొంతంగా ఆదాయాన్ని సంపాదించుకోని ఎవరి మీద ఆధార పడకుండా ఉండాలని అనుకునేవారు ఇంటి వద్దే ఉంటూ గౌరవప్రదమైన మార్గం ద్వారా ఆదాయం సంపాదించాలని చూస్తున్నారా? అయితే మీలాంటి వారి కసం భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినా ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (LIC) ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. అదే ‘బీమా సఖి యోజన‘. దీనినే మహిళా కెరీర్ ఏజెంట్ (MCA) పథకం అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ పథకంలో చేరిన మహిళలకు కేవలం కమీషన్ మాత్రమే కాకుండా, ఏకంగా మూడు సంవత్సరాల పాటు నెలవారీ స్టైపెండ్ (జీతం) కూడా అందుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం.

ముఖ్యాంశాలు..

  • మొదటి మూడు సంవత్సరాల పాటు నెలకు నిర్ణీత స్టైపెండ్ అందుతుంది.
  • కేవలం 10వ తరగతి పాసైన మహిళలు అర్హులు.
  • 18 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు.
  • పాలసీల అమ్మకాలపై అదనంగా భారీ కమీషన్ కూడా లభిస్తుంది.
  • ఇది పూర్తిస్థాయి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధి పథకం.

LIC బీమా సఖి అంటే ఏమిటి? ఎవరికి ఉపయోగం?

బీమా సఖి యోజన అనేది మహిళల ఆర్థిక స్వావలంబన కోసం LIC రూపొందించిన ఒక ప్రత్యేకమైన కెరియర్ ప్రోగ్రాం. ఇది సాధారణంగా ఇన్సూరెన్స్ ఏజెంట్లకు కేవలం కమీషన్ మాత్రమే ఉంటుంది, కానీ ఈ స్కీమ్ మలో చేరిన మహిళలకు ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు LIC స్టైపెండ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా గృహిణులు, నిరుద్యోగ యువతులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

మూడు ఏళ్ల పాటు స్టైపెండ్ వివరాలు ఇలా..

ఈ పథకంలో ఎంపికైన మహిళలకు మొదటి సంవత్సరం నెలకు రూ.7,000 చొప్పున స్టైపెండ్ అందుతుంది. రెండో సంవత్సరంలో నెలకు రూ.6,000, మూడో సంవత్సరంలో నెలకు రూ.5,000 చొప్పున LIC చెల్లిస్తుంది. అయితే, ఈ స్టైపెండ్ పొందాలంటే మొదటి ఏడాదిలో కనీసం 65% పాలసీ టార్గెట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. స్టైపెండ్‌తో పాటు మీరు అమ్మే ప్రతి పాలసీపై వచ్చే కమీషన్ మీకు అదనపు ఆదాయం అవుతుంది.

ఈ పథకానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి?

మహిళా కెరీర్ ఏజెంట్‌గా మారాలనుకునే వారు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య ఉండవచ్చు. అంటే పదవీ విరమణ పొందిన మహిళలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే, ఇప్పటికే LICలో ఏజెంట్‌గా పనిచేస్తున్న వారు లేదా LIC ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించదు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

టార్గెట్స్ మరియు పరీక్షా విధానం

ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే IRDAI నిర్వహించే ‘ప్రి-రిక్రూట్‌మెంట్ పరీక్ష‘లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో నెగ్గిన వారికి LIC శిక్షణ ఇస్తుంది. ఆ తర్వాత ఏడాదికి కనీసం 24 కొత్త పాలసీలను పూర్తి చేయాలి. అలాగే సుమారు రూ.48,000 వరకు కమీషన్ సంపాదించే లక్ష్యాన్ని చేరుకోవాలి. సరైన పద్ధతిలో పనిచేస్తే ఈ టార్గెట్స్ పూర్తి చేయడం చాలా సులభం అని సీనియర్ ఏజెంట్లు చెబుతున్నారు.

దరఖాస్తు చేయడం ఎలా? ఏయే పత్రాలు కావాలి?

ఆసక్తి గల మహిళలు ఆన్‌లైన్ ద్వారా లేదా నేరుగా దగ్గరలోని LIC బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కోసం agencycareer.licindia.in పోర్టల్‌ను సందర్శించాలి. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 10వ తరగతి మార్కుల సర్టిఫికేట్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమవుతాయి. పూర్తి వివరాల కోసం మీ ప్రాంతంలోని డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ను (DO) కలవడం ఉత్తమం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఎల్‌ఐసీ బీమా సఖి పథకానికి కనీస విద్యార్హత ఏమిటి?

PMFME
PMFME: కేంద్ర ప్రభుత్వం ద్వారా 35 శాతం సబ్సిడీతో రూ.10 లక్షల రుణం.. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ఇదే!

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రామీణ లేదా పట్టణ ప్రాంత మహిళలు ఎవరైనా ఈ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

2. ఈ పథకంలో స్టైపెండ్ ఎన్ని సంవత్సరాల పాటు వస్తుంది?

బీమా సఖి పథకం కింద ఎంపికైన మహిళలకు మొదటి 3 సంవత్సరాల పాటు నెలవారీ స్టైపెండ్ లభిస్తుంది. మొదటి ఏడాది నెలకు ₹7,000, రెండో ఏడాది ₹6,000 మరియు మూడో ఏడాది ₹5,000 చొప్పున LIC చెల్లిస్తుంది.

3. స్టైపెండ్ పొందడానికి ఏవైనా టార్గెట్స్ ఉంటాయా?

అవును, స్టైపెండ్ నిరంతరంగా పొందాలంటే ఏజెంట్లు సంవత్సరానికి కనీసం 24 కొత్త పాలసీలను పూర్తి చేయాలి. అలాగే మునుపటి సంవత్సరంలో నిర్ణయించిన టార్గెట్‌లో కనీసం 65% లక్ష్యాన్ని చేరుకుంటేనే తదుపరి ఏడాది స్టైపెండ్ కొనసాగుతుంది.

4. ఇప్పటికే ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ఉన్నవారు దీనికి అర్హులేనా?

లేదు. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ఏజెంట్‌గా పనిచేస్తున్న వారు లేదా ఎల్‌ఐసీ ఉద్యోగుల రక్త సంబంధీకులు (బంధువులు) ఈ ప్రత్యేక ‘బీమా సఖి’ (MCA) పథకానికి అర్హులు కారు. ఇది కేవలం కొత్తగా కెరీర్ ప్రారంభించాలనుకునే మహిళల కోసం ఉద్దేశించినది.

India Post office Business
Post office Business: ప్రభుత్వ భాగస్వామ్యంతో సొంత వ్యాపారం.. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం.

5. బీమా సఖిగా ఎంపికవ్వాలంటే పరీక్ష రాయాలా?

అవును. దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (IRDAI) నిర్వహించే ప్రి-రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించి ఎల్‌ఐసీ తగిన శిక్షణను కూడా అందిస్తుంది.

Read Also: CKYC ID: ఒక్కసారి KYC చేస్తే అన్ని బ్యాంకుల్లో సరిపోతుంది!

ముఖ్యంగా LIC బీమా సఖి యోజన అనేది మహిళలు సమాజంలో గౌరవంగా బ్రతకడానికి, సొంతంగా ఆదాయాన్ని సంపాదించడానికి ఒక చక్కని వేదిక. ప్రభుత్వ రంగ సంస్థలో భాగస్వామి కావాలనుకునే వారు, ఈ చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని పెద్ద స్థాయిలో ఎదగవచ్చు. ఆలస్యం చేయకుండా ఇప్పుడే దరఖాస్తు చేసుకుని మీ కెరీర్‌ను ప్రారంభించండి.

Share this News
Madhu Goud - Founder and Editor of Telugu Scheme Alert

Madhu Goud

Founder & Editor | Telugu Scheme Alert

Madhu Goud తెలుగు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా నోటిఫికేషన్లు, స్కాలర్‌షిప్‌లు, బ్యాంకింగ్ మరియు ప్రజా సేవలకు సంబంధించిన అంశాలపై రచనలు చేసే Founder & Editor. ప్రతి కథనాన్ని ప్రచురించే ముందు అధికారిక నోటిఫికేషన్లు, ప్రభుత్వ వెబ్‌సైట్లు మరియు ఇతర విశ్వసనీయ వనరులను పరిశీలించి, పాఠకులకు స్పష్టమైన, ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తారు.

You Might Also Like

Leave a Comment