ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకొని వారు కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు (Voter ID Card) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనుకునే వారికి భారత ఎన్నికల సంఘం (Election Commission of India – ECI) కీలక మార్పులను అమలు చేసింది. ఇకపై Voters Service Portal లో Form-6 నింపే సమయంలో దరఖాస్తుదారులు తమ కుటుంబానికి సంబంధించిన కొన్ని అదనపు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ నిబంధన Special Intensive Revision (SIR) కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చారు. దీని లక్ష్యం ఒకే వ్యక్తి పేరుతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల (Multiple Places) ఓటరు నమోదు కాకుండా చూడటం, కుటుంబ సభ్యుల ఓటరు నమోదు ను సులభంగా ధృవీకరించడం, అలాగే ఓటరు జాబితా మరింత ఖచ్చితంగా ఉండేలా చేయడం.
కొత్త విధానం ప్రకారం, దరఖాస్తుదారులు తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతల ఓటరు నమోదు కు సంబంధించిన వివరాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ (Declaration) పూర్తి చేసిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఈ నిబంధన ఎవరికి వర్తిస్తుంది? ఏ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి? ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Form-6 లో కొత్త Declaration సెక్షన్.. ఏ ఆప్షన్ ఎంచుకోవాలి?
భారత ఎన్నికల సంఘం Form-6 లో Part J మరియు Part K మధ్య కొత్తగా Declaration సెక్షన్ను చేర్చింది. కొత్త ఓటరు కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసే ప్రతి అభ్యర్థి ఇందులో ఇచ్చిన మూడు ఆప్షన్లలో ఒక దాన్ని తప్పనిసరిగా ఎంపిక చేయాలి.
- ఆప్షన్ 1: మీ పేరు ఇప్పటికే గత ఓటర్ల జాబితాలో ఉంటే (ఉదాహరణకు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారుతున్నవారు).
- ఆప్షన్ 2: మీ తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతల ( (Parents/Grandparents) ) పేరు గత ఓటర్ల జాబితాలో నమోదై ఉంటే (మొదటిసారి ఓటు హక్కు పొందుతున్న వారికి వర్తిస్తుంది).
- ఆప్షన్ 3: మీ పేరు, అలాగే మీ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేర్లు కూడా గత ఓటర్ల జాబితాలో లేకపోతే.
ఆప్షన్ 1 లేదా ఆప్షన్ 2 ఎంచుకునే అభ్యర్థులు సంబంధిత ఓటరు నమోదుకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం పేరు, Part Number (పోలింగ్ బూత్ నంబర్), Serial Number వంటి వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ నిబంధన ఎవరికి వర్తిస్తుంది?
ప్రస్తుతం ఈ కొత్త డిక్లరేషన్ నిబంధన ఆన్లైన్ ద్వారా Form 6 దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. పేపర్ Form 6 లేదా PDF రూపంలో సమర్పించే ఆఫ్లైన్ దరఖాస్తుల్లో ఈ సెక్షన్ ఇంకా చేర్చలేదు. అందువల్ల ఆఫ్లైన్ దరఖాస్తుదారులకు ప్రస్తుతం ఈ వివరాలు తప్పనిసరి కావు.
ఈ కొత్త నిబంధనను ఎందుకు తీసుకొచ్చారు?
ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం (Main Purpose) ఒకే వ్యక్తి పేరుతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదు కాకుండా నిరోధించడం (Preventing). అలాగే, కుటుంబ సభ్యుల ఓటరు నమోదు ను సులభంగా గుర్తించడం, వీలైనంతవరకు ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రానికి అనుసంధానం చేయడం, అలాగే ధృవీకరణ (Verification) ప్రక్రియను వేగవంతం చేయడం కూడా ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు. ఈ విధానం ద్వారా ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వం పెరగడంతో పాటు, ఎన్నికల నిర్వహణ కూడా మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
Form 6 ద్వారా కొత్త ఓటరు నమోదు కు ఎలా దరఖాస్తు చేయాలి?
- ముందుగా Voters Service Portalలో లాగిన్ అవ్వాలి లేదా కొత్త అకౌంట్ సృష్టించుకోవాలి.
- అనంతరం New Registration for General Electors (Form 6) ఎంపిక చేసి రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు నమోదు చేయాలి.
- తర్వాత వ్యక్తిగత వివరాలు, చిరునామా వివరాలు నమోదు చేసి కొత్త డిక్లరేషన్ సెక్షన్లో అవసరమైన సమాచారం ఇవ్వాలి.
- చివరగా ఫోటో, వయస్సు ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు వంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి అప్లికేషన్ను సమర్పించాలి.
- సమర్పించిన తర్వాత వచ్చే Reference ID ద్వారా దరఖాస్తు స్థితిని ట్రాక్ చేసుకోవచ్చు.
తల్లిదండ్రుల Part Number, Serial Number ఎలా తెలుసుకోవాలి?
తల్లిదండ్రుల లేదా తాతముత్తాతల ఓటరు వివరాలను అధికారిక ఓటరు సెర్చ్ పోర్టల్ లేదా Voter Helpline యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పేరు, EPIC నంబర్ లేదా మొబైల్ నంబర్ ఆధారంగా సెర్చ్ చేసి వారి Part Number (బూత్ నంబర్) మరియు Serial Number వివరాలను పొందవచ్చు. దరఖాస్తు ప్రారంభించే ముందు ఈ వివరాలను నోట్ చేసుకుంటే Form 6ను సులభంగా పూర్తి చేయవచ్చు.
ఆధార్ నంబర్ తప్పనిసరా?
లేదు. ఓటరు నమోదుకు ఆధార్ నంబర్ ఇవ్వడం ఇప్పటికీ ఐచ్ఛికం (Optional) మాత్రమే. అలాగే 18 సంవత్సరాలు పూర్తి చేసిన వారు లేదా త్వరలో 18 ఏళ్లు పూర్తి కాబోయే వారు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం మీద.. కొత్త ఓటరు నమోదు ప్రక్రియను మరింత విశ్వసనీయంగా (Trustworthy), పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రతి దరఖాస్తుదారులు తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా ఆన్లైన్లో Form 6 ద్వారా దరఖాస్తు చేయాలనుకునే వారు ముందుగానే తమ తల్లిదండ్రుల లేదా తాత ముత్తాతల (Parents/Grandparents) ఓటరు వివరాలు, బూత్ నంబర్, సీరియల్ నంబర్ సిద్ధంగా ఉంచుకుంటే అప్లికేషన్ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయవచ్చు.







