రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వ సేవల కోసం మీసేవ, ఈసేవ (Meeseva/Eseva) కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి వేచి చూసిన రోజులు చాలామందికి గుర్తుండే ఉంటాయి. ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate), డ్రైవింగ్ లైసెన్స్ (Driving License), పన్ను సేవలు (Tax Services), డిజిటల్ పత్రాలు (Digital documents) వంటి అవసరాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే డిజిటల్ ఇండియా (Digital India) కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల మొబైల్ ఫోన్‌లకు తీసుకొచ్చింది.
ప్రస్తుతం కొన్ని అధికారిక ప్రభుత్వ యాప్స్ (Official Government Apps) ద్వారా ఇంటి నుంచే పలు సేవలను సులభంగా పొందే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలను డిజిటల్ రూపంలో చూపించడం నుంచి, ప్రభుత్వ పత్రాలను భద్రపరచడం, ఆధార్ సేవలు (Aadhaar services), పన్ను సంబంధిత పనులు (Tax Related Works), డిజిటల్ చెల్లింపులు (Digital Payments) వరకు అనేక సేవలు ఇప్పుడు ఒకే మొబైల్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతో సమయం ఆదా కావడంతో పాటు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం కూడా తగ్గుతోంది.
మీ రోజువారీ జీవితంలో ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వ 6 అధికారిక యాప్స్ ఏవి? వాటి ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
mParivahan – డ్రైవింగ్ లైసెన్స్, RC వివరాలు మొబైల్‌లోనే
ప్రతి ఒక్కరు కూడాను వాహనం నడుపుతున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) సాధారణంగా కొన్ని సందర్భాలలో మర్చిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో mParivahan యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో మీరు మీ Driving License, Registration Certificate – RC డిజిటల్ కాపీలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
ట్రాఫిక్ తనిఖీల సమయంలో ఈ డిజిటల్ డాక్యుమెంట్స్ ను చూపించవచ్చు. మోటార్ వాహనాల చట్టం (Motor Vehicles Act) ప్రకారం, mParivahanలో అందుబాటులో ఉండే డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లకు చెల్లుబాటు ఉంటుంది. అంతేకాకుండా కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ (Vehicle registration) వివరాలు, యాజమాన్య సమాచారం వంటి వివరాలను కూడా ఈ యాప్ ద్వారా సులభంగా పరిశీలించవచ్చు. దీంతో వాహన సంబంధిత సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి.
DigiLocker – ముఖ్యమైన సర్టిఫికెట్లు ఎప్పుడూ మీ మొబైల్‌లోనే
మార్కుల మెమోలు (Mark Memos), ఆధార్ (Aadhar), పాన్ కార్డ్ (PAN card), డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) వంటి ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా (Safely) భద్రపరచుకోవడానికి DigiLocker యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన పత్రాలను డిజిటల్ రూపంలో క్లౌడ్ (Cloud) లో నిల్వ చేసుకోవచ్చు.
సమాచార సాంకేతిక చట్టం (Information Technology – IT) ప్రకారం DigiLocker లో ఉన్న డిజిటల్ పత్రాలు అనేక ప్రభుత్వ సేవల్లో చెల్లుబాటు అవుతాయి. దీంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు (Original Certificates) వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా కాలేజీ అడ్మిషన్లు (College admissions), ఉద్యోగ దరఖాస్తులు (Job Applications), ప్రభుత్వ సేవల సమయంలో అవసరమైన పత్రాలను క్షణాల్లో యాక్సెస్ (Access) చేసి ఉపయోగించుకోవచ్చు. ఇది ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎప్పుడూ సురక్షితంగా అందుబాటులో ఉంచే సౌకర్యాన్ని కల్పిస్తుంది.
UMANG – వెయ్యికి పైగా ప్రభుత్వ సేవలు ఒకే యాప్‌లో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు (Central / State Govt) చెందిన 1,000కు పైగా సేవలను ఒకే వేదికపై అందించడం UMANG ప్రత్యేకత. ప్రభుత్వ సేవల కోసం వేర్వేరు APPS ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా UMANG (Unified Mobile Application for New-age Governance) ఈ యాప్ పనిచేస్తుంది. అందుకే దీనిని చాలా మంది ‘సూపర్ యాప్ (Super App)’గా పిలుస్తారు. ఈ యాప్ ద్వారా EPFO ఖాతాదారులు తమ PF బ్యాలెన్స్, పాస్‌బుక్, పెన్షన్‌కు సంబంధించిన సేవలను సులభంగా పొందవచ్చు. అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ (Gas Cylinder Booking), విద్యుత్ బిల్లు చెల్లింపులు (Electricity Bill Payments,), ఆధార్, PAN, DigiLocker, ఆరోగ్య సేవలు వంటి అనేక ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
DigiYatra – ఎయిర్‌పోర్టులో వేగంగా చెక్‌ఇన్ చేసుకునేందుకు
విమాన ప్రయాణాల్లో ఎయిర్‌పోర్ట్ ప్రవేశం, భద్రతా తనిఖీల సమయంలో బోర్డింగ్ పాస్ (Boarding Pass), గుర్తింపు పత్రాల (Identification Documents) పరిశీలనకు కొంత సమయం పడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం DigiYatra సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ Facial Recognition Technology ఆధారంగా పనిచేస్తుంది. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత, పాల్గొనే విమానాశ్రయాల్లో పేపర్‌లెస్ (Paperless), కాంటాక్ట్‌లెస్ (Contactless) చెక్‌ఇన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. దీంతో పలుమార్లు పత్రాలు చూపించాల్సిన అవసరం తగ్గి, ఎయిర్‌పోర్ట్ ప్రవేశం, సెక్యూరిటీ చెక్ ప్రక్రియ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
AIS – ITR దాఖలు చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేయాల్సిన యాప్
ఆదాయపు పన్ను రిటర్న్ (Income Tax Return – ITR) దాఖలు చేసే ముందు “Annual Information Statement (AIS)” ను ఒకసారి పరిశీలించడం ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక లావాదేవీల వివరాలను ఒకే చోట చూసుకునేందుకు ఈ సేవ ఉపయోగపడుతుంది.
AISలో TDS వివరాలు, బ్యాంక్ వడ్డీ ఆదాయం (Bank Interest Income), అధిక విలువ గల ఆర్థిక లావాదేవీలు, ఇతర పన్ను సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటుంది. దీంతో ITR దాఖలు చేసే సమయంలో వివరాలను సరిచూసుకుని, పొరపాట్లు జరిగే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. పన్ను రిటర్న్ సమర్పించే ముందు మీ ఆర్థిక సమాచారాన్ని (Financial Information) ధృవీకరించేందుకు ఈ యాప్ ఉపయోగకరమైన సాధనంగా ఉంటుంది.
RBI Retail Direct – ప్రభుత్వ సెక్యూరిటీల్లో నేరుగా పెట్టుబడి పెట్టండి
బ్రోకర్లు లేదా మధ్యవర్తుల అవసరం లేకుండా ప్రభుత్వ సెక్యూరిటీల్లో నేరుగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి RBI Retail Direct సేవ ఉపయోగపడుతుంది. ఈ వేదికను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వ్యక్తిగత పెట్టుబడిదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సేవ ద్వారా ప్రభుత్వ బాండ్లు (Government Securities), ట్రెజరీ బిల్స్ (Treasury Bills), సావరిన్ గోల్డ్ బాండ్లు (అందుబాటులో ఉన్నప్పుడు) వంటి ప్రభుత్వ మద్దతు ఉన్న పెట్టుబడి సాధనాల్లో నేరుగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసే సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండటంతో, దీర్ఘకాలికంగా స్థిరమైన పెట్టుబడి ఎంపికలను కోరుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
దీనిని చదవండి – తెలంగాణ ఉద్యోగులు, పెన్షన్ పొందే వారికి న్యూస్.. NEHS హెల్త్ స్కీమ్ ప్రారంభం – డిజిటల్ హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్ ఇలా!
ఈ ప్రభుత్వ యాప్స్ ఉపయోగించే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ప్రభుత్వ సేవలకు సంబంధించిన యాప్స్‌ను ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్న నిర్లక్ష్యం కూడా వ్యక్తిగత సమాచారం, ఆర్థిక భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
- Google Play Store లేదా Apple App Store నుంచే అధికారిక యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయండి.
- APPను ఇన్‌స్టాల్ చేసే ముందు పబ్లిషర్ పేరు (Publisher Name) సంబంధిత ప్రభుత్వ శాఖదేనా అని ఒకసారి నిర్ధారించుకోండి. నకిలీ (Fake) APPs దూరంగా ఉండండి.
- ఆధార్ నంబర్, PAN నంబర్, బ్యాంకింగ్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లో మాత్రమే నమోదు చేయండి.
- OTP, పాస్‌వర్డ్, MPIN వంటి గోప్యమైన వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
- పబ్లిక్ Wi-Fi ఉపయోగిస్తున్నప్పుడు బ్యాంకింగ్ లేదా ఇతర ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉండటం మంచిది.
- భద్రత కోసం (For Security) యాప్స్‌ను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్‌కు (Latest Version) అప్‌డేట్ చేస్తూ ఉండండి.
డిజిటల్ సేవలు ఇప్పుడు నగరాల్లోనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ నుంచి పీఎఫ్ బ్యాలెన్స్ వరకు, పన్ను వివరాల నుంచి ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల వరకు అనేక పనులను ఈ Government Apps ద్వారా ఇంటి నుంచే పూర్తి చేసుకోవచ్చు.
గమనిక: APPSను డౌన్‌లోడ్ చేసే ముందు అది సంబంధిత ప్రభుత్వ శాఖ విడుదల చేసిన అధికారిక యాప్ కాదో ఒకసారి నిర్ధారించుకోండి. వ్యక్తిగత వివరాలు, OTPలను ఎవరితోనూ పంచుకోవద్దు.







