JOIN
Latest NewsTelanganaAndhra PradeshEducationLatest JobsSportsTechnology

PMFME: కేంద్ర ప్రభుత్వం ద్వారా 35 శాతం సబ్సిడీతో రూ.10 లక్షల రుణం.. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ఇదే!

ప్రతి ఒక్కరికి కూడాను చిన్న స్థాయిలో ఫుడ్ బిజినెస్ (Small Scale Food Business) చేయాలనుకునే ఆసక్తి ఉండి ఈ బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పథకం ద్వారా కొత్తగా ఆహార వ్యాపారం పెట్టాలనుకునే వారికి, అలాగే ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి భారీ సబ్సిడీ మరియు రుణ సదుపాయం (Huge Subsidy And Loan Facility) లభిస్తుంది. దేశంలో ఆహార శుద్ధి (Food Processing) రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు స్వయం ఉపాధి (Self Employment) ని ప్రోత్సహించేందుకు కేంద్ర ‘ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Ministry of Food Processing Industries – MOFPI)‘ ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం (PMFME ) పథకాన్ని అమలు చేస్తోంది.

ఈ పథకం కింద అర్హులైన (Eligible) సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు (Micro Food Processing Units), స్వయం ఉపాధి వ్యాపారులు (Self-Employed Traders), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (Farmer Producer Organization-FPO), స్వయం సహాయక సంఘాలు (SHGలు), సహకార సంఘాలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు, గరిష్టంగా రూ.10 లక్షల క్రెడిట్-లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ (Credit-Linked Capital Subsidy) పొందే అవకాశం ఉంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఈ పథకం అమలులో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా చిన్న ఆహార వ్యాపారాలను ఆధునికీకరించడం (Modernize), ఉపాధి అవకాశాలను పెంచడం (Increasing Employment Opportunities), స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకానికి ఎవరు అర్హులు? సబ్సిడీ ఎలా పొందాలి? ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Who is eligible for PMFME Scheme?

PMFME పథకం కింద సబ్సిడీ పొందాలంటే ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. చిన్న స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారం చేస్తున్నవారు లేదా కొత్తగా ప్రారంభించాలనుకునే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

  • వ్యక్తిగత పారిశ్రామికవేత్తలు (Individual Entrepreneurs), ప్రొప్రైటర్షిప్ సంస్థలు (Proprietorship Organizations), భాగస్వామ్య సంస్థలు (Partnership Firms), స్వయం సహాయక సంఘాలు (SHGs), సహకార సంఘాలు (Co-operatives), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తుదారుని వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. (Applicant Must Be At Least 18 Years Of Age.)
  • కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. (At Least 8th Class Pass)
  • దరఖాస్తు చేసే యూనిట్ సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ (Micro Food Processing Enterprise) అయి ఉండాలి.
  • సాధారణంగా 10 మంది కంటే తక్కువ మంది కార్మికుల (Workers) తో నడిచే చిన్న పరిశ్రమలు (Small Industries) ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

Special Preference For ODOP Products.

PMFME పథకంలో ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (One District One Product – ODOP)’ విధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో ప్రతి జిల్లాకు ఆ ప్రాంత ప్రత్యేకతను ప్రతిబింబించే ఒక ఆహార ఉత్పత్తి (Food Production) ని ఎంపిక చేస్తారు. దరఖాస్తుదారు (Applicant) తన జిల్లాకు గుర్తించిన ODOP ఉత్పత్తికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ (Food Processing) యూనిట్ ఏర్పాటు చేయాలనుకుంటే, రుణం మరియు ఇతర సహాయాల మంజూరులో ప్రాధాన్యత లభించే అవకాశం ఉంటుంది.

PM Kisan New Registration
PM Kisan New Registration 2026: అర్హత, పత్రాలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు

ఉదాహరణకు మామిడి, పసుపు, మిరప, పాల ఉత్పత్తులు, పచ్చళ్లు, బేకరీ ఉత్పత్తులు వంటి వస్తువులు కొన్ని జిల్లాల్లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ – ODOP గా గుర్తించబడ్డాయి. అయితే ODOP ఉత్పత్తులతో పాటు ఇతర అర్హత (Other Eligibility) కలిగిన ఆహార ప్రాసెసింగ్ వ్యాపారాలకు కూడా ఈ పథకం కింద సబ్సిడీ, శిక్షణ (Subsidy/training) మరియు ఆర్థిక సహాయం అందుబాటులో ఉంటుంది.

How is PMFME subsidy calculated?

ఈ పథకంలో సబ్సిడీ మొత్తం ప్రాజెక్టు వ్యయం (Project Cost) ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు, మీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5 లక్షలు అయితే లెక్కింపు ఇలా ఉంటుంది.

వివరంమొత్తం
ప్రాజెక్టు మొత్తం వ్యయంరూ.5,00,000
లబ్ధిదారుడి సొంత పెట్టుబడి (10%)రూ.50,000
బ్యాంకు రుణం (90%)రూ.4,50,000
ప్రభుత్వ సబ్సిడీ (35%)రూ.1,75,000

గమనిక: ప్రభుత్వం అందించే రూ.1.75 లక్షల సబ్సిడీ నేరుగా లబ్ధిదారుడి చేతికి ఇవ్వరు. అది బ్యాంకు రుణ ఖాతాలో (Loan Account) జమ చేయబడుతుంది. దీంతో రుణ భారం తగ్గి, తిరిగి చెల్లించాల్సిన మొత్తం కూడా తగ్గుతుంది. తుది రుణం, సబ్సిడీ మంజూరు బ్యాంకు మరియు పథకం నిబంధనల ప్రకారం ఉంటుంది.

Application Process for PMFME Scheme

PMFME పథకానికి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. అర్హులైన అభ్యర్థులు ఈ కింది దశలను అనుసరించి దరఖాస్తు చేసుకోవచ్చు.

PMFME Online Application
  • తొలుత అధికారిక వెబ్‌సైట్ PMFME Portal లో రిజిస్టర్ అవ్వాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో వ్యక్తిగత, వ్యాపారాని (Personal/business)కి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తు సమర్పించిన తర్వాత మీ అప్లికేషన్‌ను సంబంధిత జిల్లా రిసోర్స్ పర్సన్ (DRP) పరిశీలించి, లోన్ కోసం బ్యాంకుకు సిఫార్సు చేస్తారు.
  • అనంతరం బ్యాంకు నిబంధనల ప్రకారం రుణం, సబ్సిడీ ప్రక్రియ కొనసాగుతుంది.

గమనిక: దరఖాస్తు చేసుకునే ముందు మీ జిల్లాలో గుర్తించిన ODOP (One District One Product) ఉత్పత్తి వివరాలు, అవసరమైన పత్రాలు, తాజా మార్గదర్శకాలను అధికారిక PMFME పోర్టల్‌లో ఒకసారి పరిశీలించడం మంచిది.

India Post office Business
Post office Business: ప్రభుత్వ భాగస్వామ్యంతో సొంత వ్యాపారం.. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం.

దీనిని చదవండితెలంగాణలో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి? పూర్తి వివరాలు

మొత్తానికి, దరఖాస్తు సమర్పించిన తర్వాత, జిల్లా వనరుల వ్యక్తి (District Resource Person – DRP) మీ దరఖాస్తును మరియు మీ వ్యాపార స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అంతా సక్రమంగా ఉంటే, మీ ఫైల్‌ను బ్యాంకుకు పంపుతారు. బ్యాంక్ అధికారులు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ (Project Report) ను పరిశీలించి లోన్ మంజూరు (Sanction) చేస్తారు. లోన్ అమౌంట్ విడుదలైన తర్వాత ప్రభుత్వ సబ్సిడీ మీ బ్యాంక్ ఖాతాకు ‘మిర్రర్ అకౌంట్ (Mirror Account)’ రూపంలో లింక్ అవుతుంది.

Share this News
Madhu Goud - Founder and Editor of Telugu Scheme Alert

Madhu Goud

Founder & Editor | Telugu Scheme Alert

Madhu Goud తెలుగు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా నోటిఫికేషన్లు, స్కాలర్‌షిప్‌లు, బ్యాంకింగ్ మరియు ప్రజా సేవలకు సంబంధించిన అంశాలపై రచనలు చేసే Founder & Editor. ప్రతి కథనాన్ని ప్రచురించే ముందు అధికారిక నోటిఫికేషన్లు, ప్రభుత్వ వెబ్‌సైట్లు మరియు ఇతర విశ్వసనీయ వనరులను పరిశీలించి, పాఠకులకు స్పష్టమైన, ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తారు.

You Might Also Like

Leave a Comment