భారత ప్రభుత్వానికి చెందిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( Airports Authority of India – AAI) మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో (Airports) ఖాళీగా ఉన్న 389 మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Manager And Junior Executive Positions) భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్ (Engineering), ఐటీ(IT), ఫైనాన్స్(Finance), లా(Law), కమర్షియల్(Commercial), ఆపరేషన్స్(Operations) వంటి విభాగాల్లో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న యువతకు ఇది సూపర్ అవకాశం. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోండి.
ప్రభుత్వ రంగ సంస్థలో మంచి జీతభత్యాలు(Salaries Benefits), ఉద్యోగ భద్రత(Job security), దేశవ్యాప్తంగా పనిచేసే అవకాశం ఉండటంతో ఈ నోటిఫికేషన్‌పై ఉద్యోగార్థుల్లో ఆసక్తి (Interest) నెలకొంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
AAI Recruitment 2026 ముఖ్యాంశాలు – Highlights
| అంశం | వివరాలు |
| సంస్థ (Organization) | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airports Authority of India – AAI) |
| మొత్తం పోస్టులు (Total Vacancies) | 389 |
| పోస్టులు (Posts) | మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ |
| దరఖాస్తు విధానం (Application Process) | ఆన్‌లైన్ |
| ఉద్యోగ స్థలం (Job Place) | భారతదేశం అంతటా |
| దరఖాస్తుల ప్రారంభం (Application Starts) | ఆగస్టు 8, 2026 |
| చివరి తేదీ (End Date) | సెప్టెంబర్ 7, 2026 |
Airport Authority Jobs Vacancies / Departments
ఈ నియామకాల ద్వారా పలు సాంకేతిక మరియు పరిపాలనా (Technical and Administrative) విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా పోస్టును (Posts) ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు – Educational Qualifications
పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. ఈ పోస్టులకు సాధారణంగా ముందస్తు అనుభవం (Experience) అవసరం లేదు. అందువల్ల కొత్తగా చదువు పూర్తి చేసిన ఫ్రెషర్స్ (Freshers) కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
- మేనేజర్ పోస్టులకు: సంబంధిత విభాగంలో B.Tech లేదా B.E / కొన్ని పోస్టులకు MBA లేదా PG డిప్లొమా / సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు: B.Tech / B.E / MBA / MCA / CA
– వయోపరిమితి: AAI నోటిఫికేషన్ ప్రకారం వయోపరిమితి మేనేజర్ పోస్టులకు (Manager Posts) – గరిష్టంగా 32 సంవత్సరాలు / జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు (Executive Positions) – గరిష్టంగా 27 సంవత్సరాలు ఉంటుంది.
– వయోసడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం – SC / ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు / OBC (Non-Creamy Layer) అభ్యర్థులకు – 3 సంవత్సరాలు / OBC (Non-Creamy Layer) అభ్యర్థులకు – 3 సంవత్సరాలు / ఇతర రిజర్వేషన్ వర్గాలకు కూడా నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
జీతం – Salary ఎంత ఉంటుంది?
ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కావడంతో ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీ అందించనున్నారు. ఉద్యోగంలో అనుభవం పెరిగే కొద్దీ పదోన్నతులు(Promotions), వేతన పెంపులు (Salary increases) పొందే అవకాశం ఉంటుంది.
| పోస్టు | పే స్కేల్ | అదనపు ప్రయోజనాలు |
|---|---|---|
| మేనేజర్ (E-3 గ్రేడ్) | ₹60,000 – ₹1,80,000 నెలకు | డీఏ (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA), మెడికల్ సౌకర్యాలు, పీఎఫ్ (PF), ఇతర కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు |
| జూనియర్ ఎగ్జిక్యూటివ్ (E-1 గ్రేడ్) | ₹40,000 – ₹1,40,000 నెలకు | డీఏ (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA), మెడికల్ సౌకర్యాలు, పీఎఫ్ (PF), ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు |
ఎంపిక విధానం – Selection Process
అభ్యర్థుల ఎంపికను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification), పోస్టును బట్టి ఇంటర్వ్యూ లేదా ఇతర మూల్యాంకన ప్రక్రియ(Evaluation Process), ఫైర్ సర్వీసెస్ పోస్టులకు శారీరక సామర్థ్య (Physical Ability) పరీక్షలు కూడా ఉండవచ్చు. దశల్లో నిర్వహిస్తారు. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులకే తుది నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.
దరఖాస్తు రుసుము – Application fee
ఫీజును ఆన్‌లైన్ చెల్లింపు విధానంలో మాత్రమే చెల్లించాలి.
| అభ్యర్థుల వర్గం | ఫీజు |
| జనరల్ / OBC / EWS | ₹1,000 |
| SC / ST | ఉచితం |
| మహిళలు | ఉచితం |
| దివ్యాంగులు (PwBD) | ఉచితం |
ముఖ్యమైన తేదీలు – Important Dates
| కార్యక్రమం | తేదీ |
| దరఖాస్తుల ప్రారంభం | ఆగస్టు 8, 2026 |
| చివరి తేదీ | సెప్టెంబర్ 7, 2026 |
చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు (Application) పూర్తి చేయడం మంచిది. చివరి రోజుల్లో వెబ్‌సైట్‌పై అధిక ట్రాఫిక్ కారణంగా సాంకేతిక సమస్యలు (Technical Issues) తలెత్తే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు – Application Process
అభ్యర్థులు ముందుగా AAI అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి Recruitment విభాగంలో నోటిఫికేషన్‌ను తెరవాలి. రిజిస్ట్రేషన్ (Registration) పూర్తి చేసి, అవసరమైన వివరాలు నమోదు చేసి (Enter the Details), పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తును సమర్పించి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ కాపీని భద్రపరచుకోవాలి.
దీనిని చదవండి – డిగ్రీ అర్హతతో APCOBలో 338 ఉద్యోగాలు.. ఆగస్టు 7 వరకు దరఖాస్తులకు అవకాశం – APCOB Recruitment 2026
అధికారిక లింకులు – Official Links
- అధికారిక నోటిఫికేషన్ (PDF): AAI Recruitment 2026 Official Notification PDF
- అధికారిక వెబ్‌సైట్: https://www.aai.aero
ప్రభుత్వ రంగంలో స్థిరమైన (Stable) ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు AAI Recruitment 2026 ఒక మంచి అవకాశం. మొత్తం 389 పోస్టులతో విడుదలైన Airport Authority Jobs కు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అర్హత ఉన్నవారు ఆలస్యం చేయకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. పూర్తి అర్హతలు, పోస్టుల వారీ వివరాలు మరియు ఇతర నిబంధనలను (Rules) అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేయాలి.






