ఇంజినీరింగ్ చదవాలనే లక్ష్యం ఉన్నా, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంతోమంది విద్యార్థినులు తమ చదువును కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ప్రతిభావంతులైన(Talented) మహిళా విద్యార్థినులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో “షెఫ్లర్ ఇండియా హోప్ ఇంజినీరింగ్ స్కాలర్‌షిప్” [Schaeffler India Hope Engineering Scholarship Program 2026]ను ‘షెఫ్లర్ ఇండియా సంస్థ‘ ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా మొదటి సంవత్సరం B.Tech లేదా B.E చదువుతున్న అర్హులైన(Eligible) విద్యార్థినులకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సహాయం(Financial assistance) అందించనున్నారు. అంతేకాకుండా కార్పొరేట్ రంగ నిపుణుల నుంచి కెరీర్ మెంటర్‌షిప్(Mentorship) కూడా లభించనుంది.
షెఫ్లర్ ఇండియా హోప్ ఇంజినీరింగ్ స్కాలర్‌షిప్ అంటే ఏమిటి?
ఉన్నత విద్యను(Higher education) ఆర్థిక ఇబ్బందులు అడ్డుకోకుండా ప్రతిభావంతులైన మహిళా విద్యార్థినులు తమ ఇంజినీరింగ్ చదువును పూర్తి చేయాలనే లక్ష్యంతో Schaeffler India Hope Engineering స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపికైన(selected) విద్యార్థినులకు ప్రతి ఏడాది ఆర్థిక సహాయం అందించడంతో పాటు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలపై ప్రత్యేక మెంటర్‌షిప్ కూడా ఉంటుంది.
ఎంత ఆర్థిక సహాయం అందుతుంది?
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి సంవత్సరం రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. ఇంజినీరింగ్ కోర్సు నాలుగేళ్లు పూర్తయ్యే వరకు ఈ సహాయం(This help) కొనసాగుతుంది. మొత్తంగా ఒక్కో విద్యార్థిని రూ.2,00,000 వరకు పొందే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం నేరుగా విద్యార్థిని బ్యాంక్ ఖాతా(Bank account)లో జమ చేస్తారు.
ఈ స్కాలర్‌షిప్‌కు ఎవరు అర్హులు?
ఈ స్కాలర్‌షిప్‌కు భారతదేశానికి చెందిన మహిళా విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. UGC, AICTE లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలో ప్రస్తుతం మొదటి సంవత్సరం B.Tech లేదా B.E చదువుతూ ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. దివ్యాంగ (PwD) విద్యార్థినులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి కలిపి రూ.5 లక్షలకు మించకూడదు.
ఏ బ్రాంచ్‌ల విద్యార్థినులకు ప్రాధాన్యత?
ఈ స్కాలర్‌షిప్‌లో కంప్యూటర్ సైన్స్ (Computer Science and Engineering), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology), మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (Electronics and Communication Engineering), మెకట్రానిక్స్ వంటి సాంకేతిక విభాగాల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే దివ్యాంగ (Person with Disability) విద్యార్థినుల దరఖాస్తులను కూడా ప్రాధాన్యంతో పరిశీలిస్తారు.
మెంటర్‌షిప్ కూడా లభిస్తుంది
ఈ స్కాలర్‌షిప్ ప్రత్యేకత కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు. ఎంపికైన విద్యార్థినులకు షెఫ్లర్ ఇండియాకు చెందిన సీనియర్ నిపుణులు సుమారు ఆరు నెలల( six months) పాటు కెరీర్ గైడెన్స్, పరిశ్రమ అవసరాలు, ఉద్యోగ అవకాశాలపై మెంటర్‌షిప్ అందిస్తారు. ఇది భవిష్యత్తులో ప్లేస్‌మెంట్లు పొందడంలో ఉపయోగపడుతుంది.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటప్పుడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో(Passport size photo), ఆధార్ కార్డ్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు(Identity card), కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు(
Memos) కాలేజీ అడ్మిషన్ లెటర్, ప్రస్తుత ఏడాది ఫీజు రసీదు, విద్యార్థిని బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. దివ్యాంగులైతే సంబంధిత ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు Buddy4Study అధికారిక పోర్టల్‌ను సందర్శించి Schaeffler India Hope Engineering Scholarship 2026 పేజీని ఓపెన్ చేయాలి. “Apply Now”పై క్లిక్ చేసి కొత్తగా రిజిస్టర్ కావాలి లేదా ఇప్పటికే ఉన్న ఖాతాతో లాగిన్ అవ్వాలి. అనంతరం దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. చివరిగా అన్ని వివరాలు సరిచూసుకుని దరఖాస్తును సబ్‌మిట్ చేయాలి.
చివరి తేదీ ఎప్పుడు?
ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 15, 2026 చివరి తేదీ(Last date)గా నిర్ణయించారు. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.
ఎంపిక ఎలా జరుగుతుంది?
మొదట విద్యార్థినుల విద్యా ప్రతిభ, కుటుంబ ఆదాయం, సమర్పించిన పత్రాల ఆధారంగా దరఖాస్తులను పరిశీలిస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు Buddy4Study బృందం టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అనంతరం షెఫ్లర్ ఇండియా నిపుణుల కమిటీ తుది ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారికి స్కాలర్‌షిప్ మంజూరు చేస్తుంది.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు లేదు. మహిళా విద్యార్థినులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం మొదటి సంవత్సరం B.Tech లేదా B.E చదువుతున్న వారు మాత్రమే అప్లై చేయాలి. షెఫ్లర్ ఇండియా లేదా Buddy4Study ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు కారు.
ఇంజినీరింగ్ చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థినులకు Schaeffler India Hope Engineering Scholarship 2026 మంచి అవకాశంగా చెప్పవచ్చు. నాలుగేళ్ల పాటు రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం(Financial assistance), కార్పొరేట్ మెంటర్‌షిప్ ఒకే కార్యక్రమంలో లభించడం ఈ స్కాలర్‌షిప్ ప్రత్యేకత. అర్హత ఉన్న విద్యార్థినులు అధికారిక Buddy4Study పోర్టల్ ద్వారా గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవడం మంచిది.
గమనిక: దరఖాస్తు చేసే ముందు అర్హతలు, నిబంధనలు, అవసరమైన పత్రాలు మరియు తాజా వివరాలను Buddy4Study మరియు Schaeffler India అధికారిక ప్రకటనల్లో తప్పనిసరిగా ఒకసారి పరిశీలించండి.
మీరు లేదా మీకు తెలిసిన మహిళా ఇంజనీరింగ్ విద్యార్థిని ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులైతే, చివరి తేదీ కోసం వేచి ఉండకుండా ఇప్పుడే దరఖాస్తు చేయండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, క్లాస్‌మేట్స్‌తో కూడా షేర్ చేయండి.







